Mussoorie: పర్యాటకులకు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి

ABN , First Publish Date - 2021-09-15T13:23:37+05:30 IST

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పర్యాటకులపై ఆంక్షలు విధించారు...

Mussoorie: పర్యాటకులకు కొవిడ్ నెగిటివ్ రిపోర్టు తప్పనిసరి

ముస్సోరి (ఉత్తరాఖండ్): ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పర్యాటకులపై ఆంక్షలు విధించారు.డెహ్రాడూన్ జిల్లాలో పర్యటించే సందర్శకులు 72 గంటలకు ముందు చేయించిన ఆర్టీపీసీఆర్ కొవిడ్ నెగిటివ్ రిపోర్టు ఉన్నవారినే అనుమతించాలని డెహ్రాడూన్ జిల్లా మెజిస్ట్రేట్ రాజేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కేవలం వీకెండ్స్ లోనే పర్యాటకులను ముస్సోరి నగరంలోకి అనుమతిస్తామని మెజిస్ట్రేట్ పేర్కొన్నారు. వారాంతాల్లో కేవలం 15వేల మంది పర్యాటకులను మాత్రమే ముస్సోరి హోటళ్లలో ఉండేందుకు అనుమతించాలని నిర్ణయించారు.సహస్రధారా, గుచ్చు పానీ, ముస్సోరిలలోని నదులు, జలపాతాలు, జలాశయాల్లోకి పర్యాటకులను అనుమతించరాదని అధికారులు నిర్ణయించారు.


పర్యాటకులు, స్థానికులు బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదని అధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాన్ని ఉల్లంఘిస్తే 500 నుంచి వెయ్యి రూపాయల దాకా జరిమానా విధిస్తామని జిల్లా మెజిస్ట్రేట్ హెచ్చరించారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యాటకుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా కట్టడి కోసం డెహ్రాడూన్ నగరంలో ఈ నెల 21వతేదీ వరకు కొవిడ్ కర్ఫ్యూను విధించారు. ఉత్తరాఖండ్ లో తాజాగా 293 కరోనా కేసులు వెలుగుచూశాయి. వివాహాలకు అతిథుల సంఖ్యపై అధికారులు ఆంక్షలు విధించారు.

Updated Date - 2021-09-15T13:23:37+05:30 IST