‘బంగారు’ ఆదిత్యుడు!

ABN , First Publish Date - 2021-08-02T04:04:58+05:30 IST

‘బంగారు’ ఆదిత్యుడు!

‘బంగారు’ ఆదిత్యుడు!
బంగారు మకరతోరణం అలంకరణలో ఆదిత్యుడు

అరసవల్లిలో సూర్యనారాయణస్వామికి మకరతోరణం అలంకరణ

అరసవల్లి, ఆగస్టు 1: బంగారు మకరతోరణం అలకరంణలో అరసవల్లి సూర్యనారాయణ స్వామి ధగధగ మెరిసిపోయాడు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్లు స్వామివారు కనువిందు చేశారు. సూర్యనారాయణ స్వామికి ఆదివారం బంగారు మకరతోరణాన్ని అలంకరించా రు. 3 కేజీల 361 గ్రాముల బంగారంతో ఈ మకరతోరణాన్ని రూపొందించారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం మొదటిసారిగా ఈ మకరతోరణాన్ని ఆదిత్యునికి అలంకరించారు. ఎమ్యెల్యే ధర్మాన ప్రసాదరావు స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 112 మంది దాతలు అందించిన రూ.1.50 కోట్ల విరాళంతో  ఈ బంగారు మకరతోరణాన్ని తయారు చేసినట్లు చెప్పారు. 


రూ.3.84లక్షల ఆదాయం

సూర్యనారాయణస్వామికి ఆదివారం రూ.3,84,299 ఆదాయం లభించినట్లు ఈవో హరిసూర్యప్రకాష్‌ తెలిపారు. దర్శన టికెట్ల ద్వారా రూ.1,12,800, విరాళాల రూపంలో రూ.81,499, ప్రసాదాల ద్వారా 1.90 లక్షల ఆదాయం సమకూరినట్లు చెప్పారు. దేవదాయ, ధర్మాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, కమి షనర్‌ జి.వాణిమోహన్‌(ఐఏఎస్‌), తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌ నందమూరి లక్ష్మీపార్వతి, డీఈవో గార పగడాలమ్మ, శ్రీకాకుళం నగరపాలక సంస్థ కమిష నర్‌ చల్లా ఓబులేసులు వేర్వేరుగా ఆదిత్యుని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నగరానికి చెందిన శాలిహుండం విజయకుమార్‌, ఉషశ్రీ దంపతులు నిత్యాన్నదాన పథకానికి రూ.50వేలు విరాళంగా అందజేశారు.  కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకుడు ఇప్పిలి శంకరశర్మ, జిల్లా దేవదాయ, ధర్మాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ టి.అన్నపూర్ణ, సూపరింటెండెంట్‌ చక్రవర్తి, పాలక మండలి సభ్యులు యామిజాల గాయత్రి, పైడి భవాని, కింజరాపు ఉమారాణి, మండల మన్మధరావు, అంధవరపు రఘు, మం డవిల్లి రవి, చల్లా శ్రీనివాస్‌, అందవరపు సూరిబాబు పాల్గొన్నారు.  

 

Updated Date - 2021-08-02T04:04:58+05:30 IST