రాహుల్‌కు అపెండిసైటిస్‌

ABN , First Publish Date - 2021-05-03T09:58:44+05:30 IST

పంజాబ్‌ కింగ్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడు.

రాహుల్‌కు అపెండిసైటిస్‌

 ఆస్పత్రిలో చేరిక 

మయాంక్‌కు పంజాబ్‌ పగ్గాలు

అహ్మదాబాద్‌: పంజాబ్‌ కింగ్స్‌కు గట్టి షాక్‌ తగిలింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరాడు. పరీక్షల్లో అతడికి అపెండిసైటి్‌సగా తేలడంతో శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. దీంతో మిగిలిన మ్యాచుల్లో అతను ఆడేది సందేహంగానే మారింది. ‘శనివారం రాత్రి రాహుల్‌కు కడుపునొప్పి వచ్చింది. మందులతో తగ్గకపోయేసరికి టెస్టుల కోసం ఎమర్జెన్సీ రూమ్‌కు తరలించాం. దాంట్లో అతడికి అపెండిసైటి్‌సగా తేలింది. సర్జికల్‌ చికిత్స అవసరం కావడంతో వెంటనే ఆస్పత్రిలో చేర్పించాం’ అని పంజాబ్‌ యాజమాన్యం తెలిపింది. రాహుల్‌ స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రాహుల్‌ లీగ్‌లో అత్యధిక పరుగు (7 మ్యాచ్‌ల్లో 331)లు సాధించి ఆరెంజ్‌ క్యాప్‌తో ఉన్నాడు. 

Updated Date - 2021-05-03T09:58:44+05:30 IST