బంజారాహిల్స్‌ : తప్పతాగి కారు నడిపి బీభత్సం

ABN , First Publish Date - 2021-04-06T14:22:07+05:30 IST

మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం సృష్టించాడో యువకుడు.

బంజారాహిల్స్‌ : తప్పతాగి కారు నడిపి బీభత్సం
ధ్వంసమైన ద్విచక్ర వాహనం

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : మద్యం మత్తులో కారు నడిపి బీభత్సం సృష్టించాడో యువకుడు. బంజారాహిల్స్‌కు చెందిన వేణు సోమవారం  మద్యం మ త్తులో ఏపీ 09బీఎం 9438 కారు ను వేగంగా నడుపుతూ చెక్‌పోస్టు వద్దకు వచ్చాడు. రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టగా, వాహన దారులకు గాయాలయ్యాయి. వేణు కారు ఆపకుండా ఫిలింనగర్‌ వైపు వెళ్తుం డగా, అక్కడే ఉన్న జూబ్లీహిల్స్‌ ట్రాఫిక్‌ పోలీసులు  ఆపారు. వేణును జూబ్లీహిల్స్‌ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులకు అప్పగించారు. అతనికి శ్వాసపరీక్ష నిర్వహించగా 173 పాయింట్లని తేలింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-06T14:22:07+05:30 IST