మహిళను కారుతో ఢీకొట్టి ఈడ్చుకుపోయాడు

ABN , First Publish Date - 2020-07-05T07:58:00+05:30 IST

ఓ మహిళ (60) ను కారుతో ఢీకొట్టడమే కాకుండా చక్రాల కింద నలిగిన ఆమెపై నుంచి వాహనాన్ని పోనిచ్చాడు ఆ వ్యాపారి. కాస్త దూరం వరకు ఆమెను ఈడ్చుకుపోయాడు.

మహిళను కారుతో ఢీకొట్టి ఈడ్చుకుపోయాడు

ఆపేందుకు పాదచారుల యత్నం..

ఢిల్లీలో ఓ వ్యాపారి దుశ్చర్య


న్యూఢిల్లీ, జూలై 4: ఓ మహిళ (60) ను కారుతో ఢీకొట్టడమే కాకుండా చక్రాల కింద నలిగిన ఆమెపై నుంచి వాహనాన్ని పోనిచ్చాడు ఆ వ్యాపారి. కాస్త దూరం వరకు ఆమెను ఈడ్చుకుపోయాడు. ఆలోపే అప్రమత్తమైన అక్కడి జనం ఆమెను రక్షించేందుకు యత్నించినా లాభం లేకపోయింది.కారును ఆపేందుకు యత్నించిన ఓ పాదచారిపైనా వాహనాన్ని పోనిచ్చేందుకు అతడు యత్నించాడు. తూర్పు ఢిల్లీలోని చిల్లా గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని భాను అనే వ్యాపారవేత్తగా గుర్తించారు. గాయపడిన మహిళకు ఆస్పత్రిలో చికిత్స అందించామని, ఆమె డిశ్చార్జి అయిందని డీసీపీ జస్మీత్‌ సింగ్‌ తెలిపారు. భానును అరెస్టు చేశామని చెప్పారు. ఈ ప్రమాద ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డయి, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే తూర్పు ఢిల్లీలోనే ఘాజీపూర్‌లో శుక్రవారం ఇదే తరహా ప్రమాదం జరిగింది. పోలీసు సిబ్బంది కారుతో ఓ మహిళను ఢీకొట్టి ఆమెపై నుంచి వాహనాన్ని పోనిచ్చారు. తీవ్రంగా గాయపడిన మహిళను పాదచారులు ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2020-07-05T07:58:00+05:30 IST