Abn logo
Sep 26 2021 @ 00:56AM

రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్‌ మృతి



అనంతపురం క్రైం, సెప్టెంబరు 25 : నగరంలోని వేణుగోపాల్‌ నగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ నవీన(30) శనివారం రాత్రి ద్విచక్ర వాహనంలో తపోవనం నుంచి సోమలదొడ్డి వైపు వెళ్తున్నాడు. నేషనల్‌ పార్క్‌ సమీపంలోని ఓ డా బా వద్దకు రాగానే  వెనుక వైపు నుంచి గుర్తు తె లియని ఓ వాహనం ఢీ కొట్టి వెళ్లింది. దీంతో తీవ్రం గా గాయపడిన నవీనను స్థానికులు ప్రభు త్వాసు పత్రికి తరలించారు. అతి పరిస్థితి ఉండి.. చికిత్స పొందుతూ రాత్రి 9.20 గంటలకు మృతి చెందాడు. దీంతో బాధిత మృతుడి త ల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి చేరుకుని విలపిం చారు.  ట్రాపిక్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

పర్వతదేవరపల్లి వద్ద మరొకరు...  

కనగానపల్లి, సెప్టెంబరు25: మం డలంలోని పర్వతదేవరపల్లి 44వ జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమా దంలో ఓం ప్రకాష్‌(27) అనే యువకుడు మృతిచెందాడు. కనగానపల్లి ఎస్‌ఐ మహ్మద్‌రఫీ తెలిపిన మేరకు... చెన్నేకొత్తప ల్లికి చెందిన ఓంప్రకాష్‌ వ్యక్తిగత పనిమీద ద్విచక్రవాహనంలో అనంతపురం వెళ్లాడు. పనులు ముగించుకుని తిరుగుప్ర యాణంలో పర్వతదేవరపల్లి జంక్షన వద్ద రోడ్డుదాటుతూ... మరో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి  డివైడర్‌ను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఓంప్రకాష్‌ తీవ్రంగా గాయపడి అపస్మారకస్థితిలో వెళ్లాడు. స్థానికులు గుర్తించి 108ద్వారా అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యనిమిత్తం బెంగుళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయంత్రం మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


వంట మనిషి ఆత్మహత్య

అనంతపురం క్రైం, సెప్టెంబరు 25 : నగరంలో ఓ వంట మనిషి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వనటౌన పోలీసులు తెలిపిన మేరకు.. నగరం లోని రాణి నగర్‌కు చెందిన బషీర్‌(37) వివిధ క్యాంటీనలు, క్యాట రింగ్‌లలో వంట మనిషిగా పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. కొంత కాలంగా తాగుడికి బానిస య్యాడు. దీంతో కుటుంబ కలహాలు తలెత్తాయి. ఈ క్రమంలో శనివారం రాత్రి తాగిన మత్తులో ఇంట్లో ఎవరూ లేని స మయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొం తసేపటికి భార్య జూబేదా ఇంటికి రాగా ఉరికి వేలాడు తున్న భర్త కనిపించాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. స్థానికుల సమాచారం మేరకు వనటౌన పోలీ సు లు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.