Abn logo
Sep 19 2021 @ 01:33AM

కేఈబీ కెనాల్‌లో కారు బోల్తా

   చిరువోలు యువకుడి మృతి 

   మోపిదేవి : కేఈబీ కెనాల్‌లోకి కారుబోల్తా కొట్టి యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం తెల్లవారుజాము 3 గంటల సమ యంలో ఈ సంఘటన జరిగింది. చిరువోలు గ్రామానికి చెందిన మోపిదేవి జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు కైలా ఉమామహేశ్వరరావు రెండో కుమారుడు ప్రశాంత్‌ తన సన్నిహితులతో కలసి ఇన్నోవా కారులో విజయవాడ వెళ్లి  తిరిగివస్తుండగా, కె.కొత్తపాలెం ఆంజనేయస్వామి గుడి సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టి కేఈబీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది.  ఆ సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు. విషయం తె లుసుకున్న గ్రామస్థులు హుటాహుటిన కారులోని యువ కులను రక్షించే ప్రయత్నం చేశారు.  కైలా ప్రశాంత్‌ (25)  మృతి చెందగా, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. అవనిగడ్డ సీఐ బి.బి.రవికుమార్‌, నాగాయలంక ఎస్సై కె.శ్రీనివాస్‌ చాకచక్యంగా కారును కాలువ నుంచి ఒడ్డుకు చేర్చారు. గాయాలైన యువకులను 108లో చల్లపల్లి ప్రైవేట్‌ ఆసుపత్రికి పంపారు. ప్రశాంత్‌ భౌతికకాయాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రశాంత్‌తో  మృతితో చిరువోలులో   విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు ప్రముఖులు ప్రశాంత్‌ మృత దేహాన్ని సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు.