కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-03-08T21:37:59+05:30 IST

నగరంలోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద వెళుతున్న ఓ కారులో

కారులో మంటలు.. తప్పిన ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని తెలుగుతల్లి ఫ్లై ఓవర్ వద్ద వెళుతున్న ఓ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అయితే సమయానికి ట్రాఫిక్ సిబ్బంది ప్రతిస్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తెలుగుతల్లి ఫ్లైఓవర్ వద్ద వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఈ మంటలను చూసిన మిగతా వాహనదారులు అక్కడి నుంచి పరుగులు తీశారు. సమయానికి ట్రాఫిక్ సిబ్బంది సంఘన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ఆ రోడ్డున వెళుతున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-03-08T21:37:59+05:30 IST