Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లడి కోసం లీవ్ పెట్టిన యముడు.. కారు కింద జరిగిన అద్భుతం.. వైరల్ వీడియో!

ఈ భూమిమీద నూకలు ఉన్నంతవరకూ మనిషి బతుకు ఎన్ని ఆటంకాలు ఎదురైనా ముందుకు సాగుతుందంటారు. కొందరి జీవితంలో ఇంకా నూకలు ఉన్నాయడానికి గుర్తుగా కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. తాజాగా ఇటువంటి ఉదంతానికి సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారి నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఈ వీడియోలో.. రోడ్డు పక్కన ఒక పిల్లాడు ఆడుకుంటుండగా, వాడిపై నుంచి కారు వెళ్లిపోతుంది. దీనిని చూసిన ఆ పిల్లాడి తండ్రి పెద్దగా అరుస్తూ అక్కడకు వస్తాడు. అయితే ఆ పిల్లాడు కారు కింద నుంచి క్షేమంగా బయటకు వచ్చి, తండ్రికి ఆశ్చర్యం కలిగిస్తాడు. 

ట్విట్టర్‌లో ఈ వీడియోను @67Ironkikin పేరుతో అకౌంట్ కలిగిన యూజర్ పోస్టు చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా జరిగిన ఘటనను నమ్మలేకపోతున్నారు. ఈ వీడియో మొదట్లో.. ఒక పిల్లాడు ఆడుకోవడం కనిపిస్తుంది. ఇంతలో అక్కడున్న కారు డ్రైవర్.. డిక్కీలో ఏదో చూసుకుని, కారు ముందున్న ఆ పిల్లాడిని అతను గమనించకుండా కారు స్టార్ట్ చేసి, కారును పిల్లాడి మీదుగా పోనిస్తాడు. దీనిని గమనించిన ఆ పిల్లాడి తండ్రి పరుగుపరుగున అక్కడికి వస్తాడు. అయితే అప్పటికే కారు పిల్లాడిపై నుంచి వెళ్లిపోతుంది. సరిగ్గా అప్పుడే అద్భుతం జరిగింది. కారు వెళ్లిపోగానే పిల్లాడు దాని కింద నుంచి లేచి వస్తాడు. ఈ ప్రమాదంలో పిల్లాడికి చిన్న దెబ్బకూడా తగలకపోవడం విశేషం. ఈ వీడియోను చూసిన వారంతా ఇది భగవంతుడు చేసిన అద్భుతమని అంటున్నారు. ఇప్పటివరకూ ఈ వీడియోకు వేలకొద్దీ లైక్స్ వచ్చాయి. కొందరు నెటిజన్లు.. యముడు సెలవులో ఉన్నాడని.. అందుకే ఈ పిల్లాడు బతికిపోయాడని అటుండగా, ఈ పిల్లాడు అదృష్టానికి తాతలాంటివాడంటూ కామెంట్ చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement