Advertisement
Advertisement
Abn logo
Advertisement

హోటల్ ముందు కారును ఆపి భార్యను లోపలే ఉంచి గదులు ఖాళీగా ఉన్నాయో లేవో కనుక్కునేందుకు వెళ్లిన భర్త.. తిరిగొచ్చేసరికి జరిగింది తెలిసి మైండ్ బ్లాక్..!

ఉత్తర భారత దేశంలో నేరాల సంఖ్య ఇటీవల భారీగా పెరిగిపోయింది. దేశధాని ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్‌లతోపాటు  హర్యాణా రాష్ట్రంలోనూ దొంగతనాల కేసులు భారీగా నమోదవుతున్నాయి. 


హర్యాణా రాష్ట్రంలోని రోహ్తక్ నగరంలో ఇటీవలే ఒక కారులో భార్యభర్తలిద్దరు ప్రయాణిస్తుండగా వారికి అనుకోని సంఘటన ఎదురైంది. వారు రాజస్థాన్‌లోని తమ ఇంటికి వెళుతుండగా మార్గంలో భార్యకు ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ భర్త ఆ రాత్రికి రోహ్తక్‌లోనే ఏదైనా హోటల్‌లో బసచేయాలనుకున్నారు. అలా దారిలో ఒక రోహ్తక్ నగరంలోని సిటీ పార్కు వద్దనున్న ఒక హోటల్‌కు తన భార్యను కారులో ఆ భర్త తీసుకెళ్లాడు.


హోటల్ బయట కారును ఆపి భార్యను లోపలే ఉండమని చెప్పి అక్కడ గదులు ఖాళీగా ఉన్నాయో? లేవో? తెలుసుకుందామని వెళ్లాడు. ఆ వ్యక్తి భార్య కారులో ఒంటరిగా ఉండగా.. అప్పుడే అక్కడికి ఒక గుర్తు తెలియని వ్యక్తి వచ్చి నేరుగా కారులో కూర్చున్నాడు. దీంతో ఒక్కసారిగా ఆమె భయపడిపోయింది. ఆమెను ఆ దుండగుడు.. "చప్పుడు చేయకుండా కారులో నుంచి దిగిపో లేకపోతే చంపేస్తా" అని బెదిరించాడు. అప్పటికే భయంతో చెమటలు పట్టిన ఆమె త్వరగా కారులో నుంచి దిగిపోయింది. దీంతో ఆ దుండగుడు కారు తీసుకొని పారిపోయాడు.


ఆ తరువాత ఆమె భర్త అక్కడికి రాగా.. కారు కనిపించలేదు. భార్య భయంతో వణికిపోతోంది.. ఏం జరిగిందని ఆమెను అడిగాడు. కారు తీసుకొని దొంగ పారిపోయాడని ఆమె తెలిపింది. ఆ భార్యభర్తలిద్దరూ పోలీసులకు ఫిర్యారు చేశారు. ప్రస్తుతం పోలీసులు కారు దొంగతనం కేసు నమోదు చేసి దొంగను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement