గర్భవతికి కార్డియాక్ అరెస్ట్.. నెలలు నిండకుండానే బిడ్డను బయటకు తీసి..

ABN , First Publish Date - 2020-07-02T15:19:57+05:30 IST

కార్డియాక్‌ అరెస్ట్‌ అయిన గర్భవతిని, బిడ్డను వైద్యులు రక్షించారు. కాంటినెంటల్‌ ఆస్పత్రి అత్యవసర ట్రామా సర్వీసుల విభాగాధిపతి డాక్టర్‌ పాటిబండ్ల సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం,

గర్భవతికి కార్డియాక్ అరెస్ట్.. నెలలు నిండకుండానే బిడ్డను బయటకు తీసి..

గర్భవతి కార్డియాక్‌ అరెస్ట్‌

తల్లీబిడ్డను రక్షించిన కాంటినెంటల్‌ ఆస్పత్రి వైద్యులు


రాయదుర్గం, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కార్డియాక్‌ అరెస్ట్‌ అయిన గర్భవతిని, బిడ్డను వైద్యులు రక్షించారు. కాంటినెంటల్‌ ఆస్పత్రి అత్యవసర ట్రామా సర్వీసుల విభాగాధిపతి డాక్టర్‌ పాటిబండ్ల సౌజన్య తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం, బీదర్‌ జిల్లాకు చెందిన మహిళ గర్భవతి. కార్డియాక్‌ అరెస్ట్‌ కావడంతో ఆమెను కాంటినెంటల్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు రక్తపోటు, ప్లేట్‌లేట్ల సంఖ్య తగ్గడం, ఊపిరితిత్తులో నీరు చేరిందని గుర్తించారు. ఆమెకు `అత్యవసర విభాగంలో శ్వాస అందించి రీససికేషన్‌ ప్రక్రియ నిర్వహించామని సౌజన్య తెలిపారు. నెలలు నిండని బిడ్డను బయటకు తీసేందుకు సిజేరియన్‌ చేశామని, ప్రసవం తర్వాత తల్లి మరోసారి కార్డియాక్‌ అరెస్టు అయిందని పేర్కొన్నారు. నిపుణుల సహాయంతో ఆమెకు అత్యుత్తమ వైద్యం అందించడంతో తల్లీబిడ్డ కోలుకోవడంతో డిశ్చార్జి చేశామన్నారు. కరోనా భయంతో చాలామంది వైద్యుల వద్దకు వచ్చేందుకు భయపడుతున్నారని, దీంతో సమస్య పెద్దదై మరణాలు సంభవిస్తున్నాయని, ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలని డాక్టర్‌ సౌజన్య సూచించారు. 

Updated Date - 2020-07-02T15:19:57+05:30 IST