ధాన్యం కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-21T05:37:04+05:30 IST

ధాన్యం కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలి

ధాన్యం కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలి

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): వడ్ల కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలని  ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ తిరుపతిరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో యాస ంగి వడ్ల కొనుగోలుపై వ్యవసాయ, పౌరసరఫరా అధికారులతో సమీక్ష నిర్వహించా రు. ఆయన మాట్లాడుతూ.. ధాన్యంలో తేమశాతాన్ని గుర్తించాలన్నారు. మద్దతు ధర క్వింటాకు గ్రేడ్‌-ఎ గ్రేడ్‌కు రూ.1,888, కామన్‌ రకానికి రూ.1,868 ఇస్తామన్నారు. రైతు లకు టోకెన్లు ఇచ్చి వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. రైతులు పంట తె చ్చినపుడు పట్టా పాస్‌బుక్‌, ఆధార్‌కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ జిరాక్స్‌ పత్రాలను తెచ్చు కునేలా అవగాహన కల్పించాలన్నారు. వెయింగ్‌ యంత్రాలను సరిచూసుకోవాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద శానిటైజర్‌ను అందుబాటులో ఉంచి మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సారి 28 కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. 50వేల టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు లక్ష్యంగా నిర్ధేశించినట్లు చెప్పా రు. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంలో జాప్యం చేయొద్దన్నారు. సమావేశంలో క్వాలిటీ కంట్రోల్‌ మేనేజర్‌ వాక్యనాయక్‌, సివిల్‌సప్లయ్‌ అధికారి రాథోడ్‌, పౌరసరఫరాల సంస్థ మేనేజర్‌ శ్యామరాణి, మిల్లర్లు, సీఈవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-21T05:37:04+05:30 IST