Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన్‌ రాకుండా జాగ్రత్త వహించాలి

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌

ఉట్నూర్‌, డిసెంబరు 3: దేశంలో మరో కొత్త వైరస్‌ ఒమైక్రాన్‌ సోకుతున్నందు న  ప్రతీఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌ అన్నారు. శుక్రవారం నార్నూర్‌ మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల, గ్రామ పంచాయతీ పల్లెప్రగతి వనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నార్నూర్‌ బాలికల పాఠశాలలో తాగునీటి సమస్య ఎదుర్కొంటున్నామని బాలికలు తెలపడంతో గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ సంధ్యారాణి తో ఫోన్‌లో మాట్లాడి వెంటనే తాగునీటి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు.   అనంతరం నార్నూర్‌ మేజర్‌ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన  పల్లెప్రగతి వనాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ గజానంద్‌నాయక్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ ఆడే సురేష్‌, కాంతారావు దుర్గే, మహేందర్‌, సయ్యద్‌ కాసీం, షేక్‌ అహ్మద్‌, తదితరులు ఉన్నారు. 

Advertisement
Advertisement