Jul 30 2021 @ 06:01AM

సెట్‌లో శ్రద్ధగా...

సెట్‌లో శ్రద్ధగా సీన్‌ కోసం ప్రిపేరవుతున్నారు బాలీవుడ్‌ కథానాయిక దీపికా పడుకోన్‌. షకున్‌ బాత్రా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో దీపిక ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణలో పాల్గొంటున్నారు. షకున్‌ బాత్రా సమక్షంలో స్ర్కిప్ట్‌ను చదువుతున్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘వర్క్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌’ అనే వ్యాఖ్యను జోడించారు. ఈ చిత్రంలో అనన్యాపాండే, సిద్ధాంత్‌ చతుర్వేది జంటగా నటిస్తున్నారు. షారూఖ్‌ఖాన్‌ ‘పఠాన్‌’, రణ్‌వీర్‌సింగ్‌తో ‘83’, హృతిక్‌రోషన్‌ ‘ఫైటర్‌’ చిత్రాల్లో దీపిక నటిస్తున్నారు.