ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం!

ABN , First Publish Date - 2020-03-05T08:36:44+05:30 IST

ఉద్యోగులకు రావలసిన నాలుగు విడతల కరువు భత్యం ఇంతవరకు చెల్లించలేదు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎలాంటి కమిటీలు లేకుండా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి...

ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం!

ఉద్యోగులకు రావలసిన నాలుగు విడతల కరువు భత్యం ఇంతవరకు చెల్లించలేదు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎలాంటి కమిటీలు లేకుండా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలులోకి తెస్తానని హామీ ఇచ్చింది. కానీ, 9 నెలలు గడిచిపోయినా హామీ హామీలానే ఉండిపోయింది. కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఆరు నెలలకోమారు కరువు భత్యం ప్రకటిస్తున్నది కానీ రాష్ట్రం మాత్రం ప్రకటించడం లేదు. న్యాయంగా ఇవ్వాల్సిన డీఏలు కూడా ఉద్యమాలు చేసి తెచ్చుకోవలసిన అవసరం ఏర్పడడం బాధాకరం ! మరో పక్క వేతన సవరణ సంఘం కాలపరిమితిని  పెంచుతూ పోతున్నారు. ఇలా ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక పరమైన సమస్యలను ఏమాత్రం పట్టించుకోక పోవడం చాలా ఆశ్చర్యకరం. కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలను నిర్వహించక పోవడం వలన సిఫార్సులతో కొంతమంది ఉపాధ్యాయులు  అక్రమ బదిలీలు పొందుతున్నారు. దీనివలన సీనియర్ ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోంది. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. వారికి రావాల్సినవన్నీ వెంటనే అందించాలి.

తరిగోపుల నారాయణస్వామి , 

రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం


Updated Date - 2020-03-05T08:36:44+05:30 IST