ఆలయానికి కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-08-04T10:01:53+05:30 IST

రాష్ట్రంలో ప్రముఖ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతి గడించిన మండలంలో వేదాద్రి శ్రీ యోగానందలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంపై కరోనా ..

ఆలయానికి కరోనా దెబ్బ

జగ్గయ్యపేటరూరల్‌, ఆగస్టు 3: రాష్ట్రంలో ప్రముఖ నరసింహ క్షేత్రాల్లో ఒకటిగా ఖ్యాతి గడించిన మండలంలో వేదాద్రి శ్రీ యోగానందలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంపై కరోనా ప్రభావం పడింది. దేవస్థానంలో నిత్య దూపదీప నైవేద్యాలకు అర్చకులు దాతల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌ తర్వాతా, అన్‌లాక్‌లో దేవ స్థానానికి వచ్చే భక్తులు సంఖ్య తగ్గింది. ఆర్జిత సేవలు రద్దయ్యాయి. హుండీ ఆదాయం తగ్గింది. ఏటా రూ.70 లక్షల వరకు హుండీ ఆదాయం, ఆర్జిత సేవలు, టిక్కెట్ల ద్వారా రూ.20 లక్షల ఆదాయం వచ్చేది.


ఆలయ భూముల కౌలు ద్వారా ఆదాయం వస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా దేవస్థానంలో విచ్చలవిడిగా జరిగిన తాత్కాలిక ఉద్యోగుల నియా మకం, ఇతర దేవస్థానాల నుంచి వచ్చి పాతుకు పోయిన ఉద్యోగులకు భారీ మొత్తంలో వేతనాలు ఇవ్వాల్సిరావటంతో ఆదాయం జీతభత్యాలకే సరిపోవటం లేదు. దేవస్థానంలో ఉన్న కాటేజ్‌లలో కొందరు పాటదారులు, ఉద్యోగులు తిష్ట వేయటంతో వాటి ఆదాయం లేకుండా పోయింది. కరోనా ప్రభావాన్ని సాకు చూపుతున్న అధికారులు నిత్యదూప దీప నైవేద్యాలకు ఇవ్వాల్సిన పడితరాన్ని ఇవ్వటం లేదని అర్చకులు భక్తులను ఆశ్రయి స్తున్నారు. గత కొన్ని నెలలుగా దేవస్థానం విద్యుత్‌ బిల్లులను కూడా చెల్లించటం లేదని, రూ.4 లక్షలకు పైనే బకాయి ఉన్నట్టు సిబ్బంది చెబుతున్నారు.

Updated Date - 2020-08-04T10:01:53+05:30 IST