Abn logo
Aug 2 2020 @ 05:45AM

కరోనా పరీక్షకు వచ్చి ఆస్పత్రి గేటు వద్ద మృతి

ఆకివీడు, ఆగస్టు 1: ఆకివీడు సీ హెచ్‌సీ ఆస్పత్రికి చికిత్సకు వస్తూ గేటు బయట ప్రాణాలొదిలిన వ్య క్తికి కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. విజయవాడలో వడ్రంగి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వ్యక్తి పనులు లేకపోవడంతో మూ డు నెలల క్రితం దుంపగడప పల్లెపాలెంలోని అన్న దగ్గరకు భార్య, పిల్లలతో వచ్చి చేపల ప్యాకింగ్‌ పనికి వెళ్తున్నాడు.


సుగర్‌కు మందులు వాడడం మానేయడంతో శుక్రవారం అర్ధరాత్రి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అతడిని 108లో భీమవరం ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా కరోనా టెస్టు చేయకుండా వైద్యం చేయమని చెప్పినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. శనివారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి మోటారుసైకిల్‌పై తీసుకెళ్లేసరికి గేటు బయట పడిపోయాడు. వైద్యుడు రంగారావుకి తెలపడంతో పరిశీలించి మృతి చెందినట్టు తెలిపారు. అనంతరం కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌ వచ్చిందన్నారు. 

Advertisement
Advertisement
Advertisement