కరోనా@90 వేలు

ABN , First Publish Date - 2020-10-25T11:06:09+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 90 వేల మార్కును దాటింది. శనివారం కొత్తగా నమోదైన 554 కేసులతో గడిచిన 7 నెలల్లో నమోదైన కేసుల సంఖ్య 90,154కు చేరింది.

కరోనా@90 వేలు

కొత్తగా నమోదైన కేసులు 554

జిల్లాలో మొత్తం 90,154


ఏలూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 90 వేల మార్కును దాటింది.  శనివారం కొత్తగా నమోదైన 554 కేసులతో గడిచిన 7 నెలల్లో నమోదైన కేసుల సంఖ్య  90,154కు చేరింది.  పాలకొల్లులో శనివారం అత్యధికం గా 65 కేసులు నమోదు కాగా నరసాపురం 35, భీమవరం 32, తాడేపల్లిగూడెం 31, జంగారెడ్డిగూడెం 26, పోడూరు 25, ఏలూరు 20, ఆచంట 20, కుక్కునూరు 19 కేసులతో అత్యధిక కేసులు నమోదైన మండలాలుగా ఉన్నాయి. అత్తిలి 17, పెదపాడు 17, పెనుమంట్ర 15, తణుకు 14, గణపవరం 13, నిడదవోలు 13, ఆకివీడు 11, పోలవరం 11, కొవ్వూరు 10 మినహా మిగిలిన అన్ని మండలాల్లో కేసుల సంఖ్య ఒక అంకెకే పరిమితమైంది. శ నివారం ఒకరు మరణించడంతో మృతుల సంఖ్య 488కు చేరింది. 


ఇద్దరు కరోనా బాధితుల ఆత్మహత్య

ఏలూరు క్రైం, అక్టోబరు 24 : కరోనా వైరస్‌తో బాధపడుతున్న ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొన్ని గంటల వ్యవధిల్లోనే ఆత్మహత్యకు పాల్ప డ్డారు. ఏలూరు సమీపంలోని కొవిడ్‌ ఆస్పత్రిలో బుట్టాయిగూ డెంనకు చెందిన ఓ వృద్ధుడు (61), ఏలూరు నగరం లోని వంగాయిగూడెంనకు చెందిన ఓ వ్యక్తి (42) కరో నా వైరస్‌ సోకడంతో చికిత్స పొందుతున్నారు. కరోనా సోకిన వృద్ధుడు మానసిక వేదనకు గురై శుక్రవారం రాత్రి తన వద్ద ఉన్న పండ్లను కోసే చాకుతో ఛాతీపై పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం 8.30 గంటలకు వంగాయిగూడెంనకు చెందిన వ్యక్తి మిగిలిన కరోనా బాధితులు చూస్తుండగానే కిటి కీలో నుంచి భవనం పైనుంచి కిందకు దూకి ఆత్మహ త్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం ఏలూరు రూరల్‌ పోలీసులకు అందడంతో రూరల్‌ ఎస్‌ఐ చావా సురేశ్‌ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిద్దరు మానసికంగా  కుంగిపోయి ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రాథమికంగా పంచనామాలో నమోదు చేశారు. 

Updated Date - 2020-10-25T11:06:09+05:30 IST