విద్యాలయాల్లో కరోనా.. ఒక ఉపాధ్యాయిని, మరో విద్యార్థిని పాజిటివ్‌

ABN , First Publish Date - 2021-03-02T05:22:50+05:30 IST

విద్యాలయాల్లో కరోనా.. ఒక ఉపాధ్యాయిని, మరో విద్యార్థిని పాజిటివ్‌

విద్యాలయాల్లో కరోనా.. ఒక ఉపాధ్యాయిని, మరో విద్యార్థిని పాజిటివ్‌
కరకగూడెం కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాల

కొత్తగూడెం కలెక్టరేట్‌/ కరకగూడెం, మార్చి 1: కరోనా మహమ్మారి తగ్గు ముఖం పట్టిందనుకుంటున్న తరుణంలో పంజా విప్పుతోంది. క్రమంగా కేసుల నమోదు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విద్యాలయ ప్రాంగణాల్లో రెండు పాజిటివ్‌లను గుర్తించడం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగూడెం పట్టణ పరిధిలోని మేదర్‌బస్తీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌ రావడంతో అధికార యంత్రాగం అప్రమత్తమైంది. సోమవారం ప్రత్యేక వైద్య బృందం ఆ పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు నిర్వహించింది. కరకగూడెంలో 13 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా కస్తూర్బాగాంధీ (కేజీవీబీ) పాఠశాలలో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దాంతో పాఠశాలలో వైద్యసిబ్బంది ఆధ్వర్యంలో శానిటైజేషన్‌ చేశారు. 14రోజులపాటు పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారి పర్శియా తెలిపారు. 

Updated Date - 2021-03-02T05:22:50+05:30 IST