99కి చేరిన కరోనా మృతులు

ABN , First Publish Date - 2020-04-05T20:08:14+05:30 IST

కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా పోరాటం సాగిస్తున్నప్పటికీ మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. 'వరల్డోమీటర్స్' తాజా గణంకాల ప్రకారం..

99కి చేరిన కరోనా మృతులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిపై పోరాటానికి ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా పోరాటం సాగిస్తున్నప్పటికీ మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. 'వరల్డోమీటర్స్' తాజా గణంకాల ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకూ కరోనా మృతుల సంఖ్య 99కి చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,588 మందికి చేరుకుంది. 229 మందికి పూర్తిగా స్వస్థత చేకూరించింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,260గా ఉంది.


కాగా, ఎక్కువ కేసులు, మరణాలు మహారాష్ట్ర నుంచి నమోదయ్యాయి. గుజరాత్‌లో 11, తెలంగాణలో 7, మధ్యప్రదేశ్‌లో 6, ఢిల్లీలో 6, పంజాబ్‌లో ఐదు కరనా మరణాలు చోటుచేసుకున్నాయి. కర్ణాటకలోలో నలుగురు, పశ్చిమబెంగాల్, తమిళనాడులో చెరో ముగ్గురు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్‌లలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.


గుజరాత్‌లో 11కు చేరిన మృతులు..

సూరత్‌లో ఆదివారంనాడు ఒక మహిళ కోవిడ్-19తో మృతి చెందింది. దీంతో గుజరాత్‌లో కోవిడ్ మృతుల సంఖ్య 11కు చేరింది. పాజిటివ్ కేసులు కూడా 12 వెలుగుచూడటంతో ఆ మొత్తం 122కు పెరిగింది. గరిష్టంగా అహ్మదాబాద్‌లో 55 కేసులు నమోదయ్యాయి.


కాగా,  చెన్నైలో 60 మహిళ, 71 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు మరణించడంతో తమిళనాడులో కరోనా మృతుల సంఖ్య 5కు చేరినట్టు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో 34 కరోనా పాజిటివ్ కొత్త కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-04-05T20:08:14+05:30 IST