పనులిలా.. బతుకుడెలా..!

ABN , First Publish Date - 2021-05-10T06:21:55+05:30 IST

కరోనా వైరస్‌ ప్రత్యక్షంగా,

పనులిలా.. బతుకుడెలా..!
పనిలేకపోవడంతో దుమ్ముతో నిండి పోయిన సారె (కుండలు చేసే యంత్రం)

- చితికిపోయిన కుమ్మరులు

- పనులు లేక ఆర్థిక ఇబ్బందులు


అల్వాల్‌ మే 9 (ఆంధ్రజ్యోతి) : కరోనా వైరస్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపుతోంది. ఆరోగ్యపరంగానే కాదు.. ఆర్థికంగానూ చిదిమేస్తోంది. ప్రధానంగా చేతి వృత్తిదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇళ్లకే పరిమితం కావడంతో అద్దెలు చెల్లించలేక, నిత్యావసరాలు కొనుగోలు చేయలేక, కుటుంబ పోషణకు అవస్థలు పాలవుతున్నారు. 


సీజన్‌లో కోలుకోలేని దెబ్బ 

కుమ్మరి కులస్తుల వ్యాపారానికి వేసవి మంచి సీజన్‌. తెలంగాణ వ్యాప్తంగా 14 లక్షల వరకు ఉన్నారు. వారిలో వృత్తిని నమ్ముకున్న వాళ్లు 4.5 లక్షల వరకు ఉన్నారు. వేసవి రాగానే కుండలు, హోటళ్లల్లో నాన్‌ల కోసం బట్టీలకు ఉపయోగించే వస్తువుల తయారీలో బిజీగా  ఉండేవారు. కరోనా కారణంగా రెండేళ్లుగా పనులు కరువవడంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.


ప్రభుత్వం సాయం చేయాలి 

సారె తిరుగుతేనే కుటుంబ పోషణ జరిగే వృత్తి. మార్చి నెల నుంచి మే నెల వరకే మంచి వ్యాపారం ఉంటుంది. కరోనా కారణంగా గతేడాది, ఇప్పుడు కూడా వ్యాపారాలు లేవు. దీంతో ఆర్థిక సమస్యలు పెరిగాయి. దీనికి తోడు పలువురు కరోనా బారిన పడ్డారు. అప్పుల నుంచి బయట పడాలంటే ప్రభుత్వం సాయం అందించాలి.

 ఆర్‌.వీరేశం, కుమ్మరి సంఘం మేడ్చల్‌ జిల్లా అధ్యక్షుడు.

Updated Date - 2021-05-10T06:21:55+05:30 IST