కరోనా నేపధ్యంలో ఆర్‌బీఐ లోన్ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి...

ABN , First Publish Date - 2021-05-06T21:35:17+05:30 IST

కోవిడ్ నేపధ్యంలో... ఆర్‌బీఐ లోన్ రీ పస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మళ్లీ లోన్ మారటోరియం ప్రయోజనాన్ని పొందొచ్చు. వివరాలిలా ఉన్నాయి.

కరోనా నేపధ్యంలో ఆర్‌బీఐ లోన్ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ అందుబాటులోకి...

న్యూఢిల్లీ : కోవిడ్ నేపధ్యంలో... ఆర్‌బీఐ లోన్ రీ పస్ట్రక్చరింగ్ ఫెసిలిటీ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మళ్లీ లోన్ మారటోరియం ప్రయోజనాన్ని పొందొచ్చు. వివరాలిలా ఉన్నాయి. కోవిడ్ 19 సెకండ్ వేవ్ కారణంగా మళ్లీ దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడేలా కనిపిస్తోంది. రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. దీంతో వ్యాపారులపై ప్రభావం పడుతోంది. ఇక ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.


పలువురు ఉపాధి కోల్పోతున్నారు. ఈ నేపధ్యంలో... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ మారటోరియం బెనిఫిట్ అందిస్తోంది. లోన్ రీస్ట్రక్చరింగ్ ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నేపధ్యంలో... రుణ గ్రహీతలు తమ రుణాన్ని రీస్ట్రక్చర్ చేసుకోవచ్చు. ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే దీనికి బ్యాంక్ నుంచి ముందుగానే అనుమతి తీసుకోవాలి. అంటే మీరు లోన్ రీస్ట్రక్చర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 

Updated Date - 2021-05-06T21:35:17+05:30 IST