ఆర్థిక కార్యకలాపాలపై కరోనా సెకండ్ వేవ్: ప్రతికూల ప్రభావం...

ABN , First Publish Date - 2021-05-08T01:01:14+05:30 IST

దేశ ఆర్థిక కార్యకలాపాలపై కరోనా సెకండ్ వేవ్ 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 2021 నెలవారీ సమీక్షా నివేదికలో పేర్కొంది.

ఆర్థిక కార్యకలాపాలపై కరోనా సెకండ్ వేవ్:  ప్రతికూల ప్రభావం...

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక కార్యకలాపాలపై కరోనా సెకండ్ వేవ్ 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో  ప్రతికూల ప్రభావాన్ని చూపుతోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 2021 నెలవారీ సమీక్షా నివేదికలో పేర్కొంది. నివేదికలోని మరిన్ని వివరాలిలా ఉన్నాయి.


దేశవ్యాప్తంగా కరోనా అంటువ్యాధి ఉధృతమవుతోంది. మరణాలు కూడా పెరుగుతున్నాయి. అయినప్పటికీ కరోనా ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని అభిప్రాయపడడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం రెండు త్రైమాసికాలు ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. గతేడాది దేశవ్యాప్త లాక్‌డౌన్ నేపధ్యంలో... జూన్ త్రైమాసికంలో మైనస్ 23.9 శాతం ప్రతికూలత, తర్వాతి త్రైమాసికంలో మైనస్ 7.5 శాతం ప్రతికూలత నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జీడీపీ వృద్ధి రేటు మూడో త్రైమాసికంలో 0.4 శాతంగా నమోదైంది. 


అయితే తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత ఆర్థిక రికవరీపై ప్రభావం చూపుతోంది. కరోనాతో కలిసి జీవించడం, అంతర్జాతీయానుభవం, ఆర్థిక రికవరీపై సెకండ్ వేవ్ ప్రభావం కాస్త తక్కువగా ఉంటుందని ఆర్థికమంత్రిత్వ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఆరోగ్య మౌలిక సదుపాయాలు పెంచడం, సరఫరా వేగవంతం చేయడం కలిసి వస్తుందని తెలిపింది.

Updated Date - 2021-05-08T01:01:14+05:30 IST