‘రెస్టారెంట్’పై కరోనా ఎఫెక్ట్

ABN , First Publish Date - 2021-07-24T00:57:57+05:30 IST

కరోనా నేపధ్యంలో రెస్టారెంట్ రంగం కుదేలైంది. ఏడాదిన్నర కాలంలో దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా రెస్టారెంట్లు మూతపడ్డాయి.

‘రెస్టారెంట్’పై కరోనా ఎఫెక్ట్

ముంబై : కరోనా నేపధ్యంలో రెస్టారెంట్ రంగం కుదేలైంది. ఏడాదిన్నర కాలంలో దేశవ్యాప్తంగా రెండు లక్షలకు పైగా రెస్టారెంట్లు మూతపడ్డాయి. దీంతో 30-35 లక్షల మంది ఉపాధి విషయంలో ఆటుపోట్లనెదుర్కొన్నారు. దేశంలో రెస్టారెంట్ పరిశ్రమకు కరోనాకు ముందు  వార్షిక వ్యాపారం రూ. 4 లక్షల కోట్లు ఉండగా, ఇప్పుడు కేవలం రూ. 1.25 లక్షల కోట్లు. దేశంలో సంఘటితంగా ఉన్న రెస్టారెంట్లు ఐదు లక్షలకు పైమాటే.


కరోనా మొదటి వేవ్ లో  30 % రెస్టారెంట్లు, రెండవ వేవ్ లో 10 % రెస్టారెంట్లు(మొత్తంమీద రెండు లక్షల రెస్టారెంట్లు)  మూతబడ్డాయి. ఈ పరిశ్రమలో ప్రత్యక్షంగా సుమారు 73 లక్షల మంది ఉద్యోగులున్నారు, వీరిలో సగం మంది అంటే 30-35 లక్షల మంది ఉపాధి ప్రభావితమైంది. ఇక కరోనా నేపధ్యంలో  ఫైన్ డైనింగ్ ఎక్కువగా దెబ్బతిందని, ఇక నైట్ క్లబ్‌లు, బాంక్వెట్ హాళ్ళు, బార్‌లపై తారస్థాయిలో ప్రభావం చూపిందని చెబుతున్నారు.

Updated Date - 2021-07-24T00:57:57+05:30 IST