కరోనా ప్రభావం... జీడీపీ... 11 నుంచి 9.8 శాతానికి తగ్గింపు... ఎస్అండ్‌పీ

ABN , First Publish Date - 2021-05-06T02:05:43+05:30 IST

దేశ ఆర్థికవ్యవస్థ రికవరీ సాధిస్తోన్న నేపధ్యంలో కరోనా సెకెండ్ వేవ్‌ కారణంగా మళ్ళీ మందగమనమేర్పడే ప్రమాదముందని గ్లోబల్ రేటింగ్ సంస్థ ‘ఎస్అండ్‌పీ’ పేర్కొంది.

కరోనా ప్రభావం...  జీడీపీ... 11 నుంచి 9.8 శాతానికి తగ్గింపు... ఎస్అండ్‌పీ

న్యూఢిల్లీ : దేశ ఆర్థికవ్యవస్థ రికవరీ సాధిస్తోన్న నేపధ్యంలో కరోనా సెకెండ్ వేవ్‌ కారణంగా మళ్ళీ మందగమనమేర్పడే ప్రమాదముందని గ్లోబల్ రేటింగ్ సంస్థ ‘ఎస్అండ్‌పీ’ పేర్కొంది. ఈ క్రమంలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వృద్ధి అంచనాను 11 శాతం నుంచి 9.8 శాతానికి తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.


ప్రస్తుత పరిస్థితుల్లో తమ జీడీపీ అంచనాల్లో సుమారు 1.2 శాతం కుదించుకుపోవచ్చని, ఈ క్రమంలో వృద్ధి రేటు 9.8 శాతానికి పరిమితమవుతుందని ఎస్అండ్‌పీ పేర్కొంది ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా జూన్ చివరి నాటికి మరింత తీవ్ర రూపం దాల్చి గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని ఈ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. .


అంటే... ఈ ఏడాది తర్వాత రికవరీ పుంజుకుంటుందని భావిస్తున్నట్టు పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకా తయారీ దేశంగా ఉన్నప్పటికీ... భారత్‌లో గ్రామీణ జనాభాకు టీకాలనందించడం అతిపెద్ద సవాలుగా మారనుందని అభిప్రాయపడింది. అంతిమంగా ఈ పరిణామాలన్నీ జీడీపీపై ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొంది. 

Updated Date - 2021-05-06T02:05:43+05:30 IST