Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా ఎఫెక్ట్... రెండు నెలల్లో... రెండు కోట్ల మందికి పైగా ఉద్యోగాలు హాంఫట్...

బెంగళూరు : కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో... దేశవ్యాప్తంగా ఏప్రిల్, మే నెలల్లో దాదాపు రెండు కోట్ల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోయారు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా కొలువులపై ప్రభావం పడింది. ఒక్క మే నెలలోనే 1.5 కోట్లకు పైగా ఉద్యోగాలు గల్లంతు కావడం గమనార్హం.  ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ కానమీ(సీఎంఐఈ)’ డేటా ప్రకారం ఈ ఏడాది మే 30 వ తేదీతో ముగిసిన వారానికి అర్బన్ నిరుద్యోగిత రేటు ఏడాది గరిష్టస్థాయి(18 శాతం)కి పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇది 39.08 శాతం.  


నాలుగు నెలలుగా తగ్గుదల... 

వరుసగా నాలుగు నెలలుగా ఉద్యోగాలు తగ్గుతూ వస్తున్నాయి. ఇక... ఏప్రిల్, మే నెలల్లో తగ్గుదల అధికంగా నమోదైంది. ఈ ఏడాది జనవరి నెలలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 40.06 కోట్లు కాగా, మే చివరి నాటికి 37.56 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 2.53 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. అంటే...  గడిచిన రెడు నెలల్లోనే 2.27 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 


ఇక కిందటేడాది(2020) కరోనా ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు గృహస్తుల ఆదాయం ఏకంగా 97 శాతం మేర క్షీణించిందని సీఎంఐఈ సర్వేలో వెల్లడైంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో 1.76 లక్షల హౌస్‌హోల్డ్స్ అభిప్రాయాలతో ఈ సర్వే జరిగింది. ఇందులో మేడు శాతం మంది మాత్రమే తమ ఆదాయం పెరిగిందని, 56 శాతం మంది తమ ఆదాయం క్షీణించిందని, 41 శాతం మంది ఏడాది క్రితం ఉన్న పరిస్థితే కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇక...  ద్రవ్యోల్బణంప్రాతిపదికన... 97 శాతం మంది ఆదాయాలు పడిపోయినట్లు సర్వే తేల్చడం గమనార్హం. 

Advertisement
Advertisement