నూజివీడు డివిజన్‌లో 169 కరోనా కేసులు: సబ్‌ కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-05-14T05:41:15+05:30 IST

నూజివీడు డివిజన్‌లో 169 కరోనా కేసులు: సబ్‌ కలెక్టర్‌

నూజివీడు డివిజన్‌లో 169 కరోనా కేసులు: సబ్‌ కలెక్టర్‌

నూజివీడు, మే 13: నూజివీడు డివిజన్‌ పరిధిలో గురువారం 169 కరోనా కేసులు నమోదయ్యాయని సబ్‌ కలెక్టర్‌ ప్రతిష్ట మంగైన్‌ తెలిపారు. ఉంగుటూరు మండలంలో 20, గన్నవరం మండలంలో 57, బాపులపాడు మండలంలో 8, ఆగిరిపల్లి మండలంలో 56, తిరువూరు మండలంలో 5, గంపలగూడెం మండలంలో 2, నూజివీడు మండలంలో 6, నూజివీడు పట్టణంలో 14, చాట్రాయి మండలంలో 1 మొత్తం 169 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు చెప్పారు. డివిజన్‌లోని ప్రజలు నిబంధనలు పాటిస్తూ, అధికారులు కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలకు సహకరించాలని కోరారు. కర్ఫ్యూ సమయాల్లో ప్రజలు బయటకు రావద్దని సూచించారు.

Updated Date - 2021-05-14T05:41:15+05:30 IST