తగ్గిన నిర్ధారణ పరీక్షలు

ABN , First Publish Date - 2021-05-11T06:26:12+05:30 IST

జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గిపోయాయి. రోజూ 6 వేల నుంచి 8 వేల వరకు నిర్ధారణ పరీక్షలు సాగేవి. గడిచిన 24 గంటల్లో 1792 శాంపిల్స్‌ మాత్రమే పరీక్షించారు. దీంతో సోమవారం ఒక్క రోజులో కేవలం 639 కరోనా కేసులు జిల్లాలో నమోదయ్యాయి.

తగ్గిన నిర్ధారణ పరీక్షలు

పడిపోయిన పాజిటివ్‌ కేసులు

కొత్తగా 639 మందికి కరోనా

మహమ్మారికి మరో ముగ్గురు బలి


అనంతపురం వైద్యం, మే10: జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గిపోయాయి. రోజూ 6 వేల నుంచి 8 వేల వరకు నిర్ధారణ పరీక్షలు సాగేవి. గడిచిన 24 గంటల్లో 1792 శాంపిల్స్‌ మాత్రమే పరీక్షించారు. దీంతో సోమవారం ఒక్క రోజులో కేవలం 639 కరోనా కేసులు జిల్లాలో నమోదయ్యాయి. పరీక్షించిన శాంపిళ్లకు, వచ్చిన కేసులను బేరీజు వేస్తే జిల్లాలో వైరస్‌ ప్రభావం అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మహమ్మారికి మరో ముగ్గురు బలైపోయారు. దీంతో ఇప్పటి వరకు జిల్లాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 99416కి చేరింది. ఇందులో 732 మంది మరణించారు. 84988 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. ప్రస్తుతం 13696 మంది మహమ్మారితో పోరాడుతున్నట్లు అధికారులు తెలిపారు.


41 మండలాల్లో కొత్త కేసులు

జిల్లాలో సోమవారం విడుదల చేసిన బులెటెనలో 41 మండలాల్లో కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో గోరంట్లలో అత్యధికంగా 98, ధర్మవరం 91, అనంతపురం 75, కళ్యాణదుర్గం 38, నల్లమాడ 32, కూడేరు 29, శెట్టూరు 26, యాడికి 24, పెనుకొండ 23, గుంతకల్లు 21, రాయదుర్గం 19, కనేకల్లు 17, డీ హీరేహాళ్‌ 14, బ్రహ్మసముద్రం 11, గుమ్మఘట్ట, కంబదూరు 9, బొమ్మనహాల్‌, రొద్దం 8, కదిరి, ఉరవకొండ, సీకేపల్లి, గుదిబండ, కనగానిపల్లి 6, కొత్తచెరువు, రాప్తాడు, తాడిపత్రి 5, అమరాపురం, బెలుగుప్ప, గార్లదిన్నె, సోమందేపల్లి 4, చిలమత్తూరు, కుందుర్పి, మడకశిర 3, బుక్కపట్నం, పుట్టపర్తి, రామగిరి 2, అమడగూరు, బుక్కరాయసముద్రం, నార్పల మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇతర జిల్లాలకు చెందిన వారు ఒకరున్నారు.




Updated Date - 2021-05-11T06:26:12+05:30 IST