మళ్లీ కొవిడ్‌ కలకలం

ABN , First Publish Date - 2022-01-19T05:12:47+05:30 IST

మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి.

మళ్లీ కొవిడ్‌ కలకలం
ఆకివీడులో కొవిడ్‌ టెస్ట్‌ చేస్తున్న వైద్య సిబ్బంది

పెరుగుతున్న కేసులు

ఆకివీడులో డిజిటల్‌ అసిస్టెంట్‌కు కరోనా


ఆకివీడు, జనవరి 18 : మళ్లీ కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అధికారులు కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పా టులో నిమగ్నమయ్యారు. ప్రతీ మం డలంలోనూ కేసుల సంఖ్య పెరుగు తోంది.ఆకివీడు పట్టణ పరిధిలో మంగ ళవారం 4 కొవిడ్‌ కేసులు నమోద య్యాయని యూపీహెచ్‌సీ వైద్యుడు పవన్‌కుమార్‌ తెలిపారు.జానకినగర్‌–2, సిద్ధాపురం రోడ్‌లో–2 వచ్చాయి.ఈ నలుగురిలో ఒకరు అమృతరావునగర్‌ కాలనీ సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సచివాలయ ఉద్యోగులు ఆందోళన చెందుతు న్నారు.  నలుగురు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారు. సీహెచ్‌సీ కొవిడ్‌ ఆస్పత్రిగా, యూపీహెచ్‌సీ జనరల్‌ ఆసుపత్రిగా, మరొకచోట కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని ఉన్నతాధికారులకు నివేదిక పంపించామన్నారు. అప్రమత్తంగా ఉండాలన్నారు  


మావుళ్లమ్మ సాంస్కృతిక కార్యక్రమాలు కుదింపు..


భీమవరంటౌన్‌, జనవరి 18 :
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మావుళ్లమ్మ 58వ వార్షిక మహోత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కుదించేశారు.రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విఽధించింది. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటలలోపు కార్యక్రమాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని నిర్వాహకులు తెలిపారు. భక్తులు గమనించి సహకరించాలని కోరారు.


చంద్రబాబు, లోకేష్‌ కోలుకోవాలని పూజలు..


పాలకొల్లు టౌన్‌, జనవరి 18 :
నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ కొవిడ్‌ నుంచి త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ మంగళవారం  క్షీరా రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేయించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కొవిడ్‌ బారిన పడ్డారని తెలిపారు.


కొవిడ్‌ ఆసుపత్రిగా భీమవరం?  


భీమవరం క్రైమ్‌, జనవరి 18 :  భీమవరం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిని మళ్లీ కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చే అవకాశం ఉంది. సుమారు  నాలుగు నెలలుగా ఆసుపత్రిలో సాధారణ వైద్య సేవలందిస్తున్నారు. కొవిడ్‌ విజృంభణ నేపఽథ్యంలో కొవిడ్‌ ఆసుపత్రిగా మార్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ బాధితులు ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. కొంత మంది హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. కొవిడ్‌ ఆసుపత్రిగా మార్పు చేసేందుకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని ఆసుపత్రి సూపరిండెంట్‌ వీరాస్వామి తెలిపారు.


Updated Date - 2022-01-19T05:12:47+05:30 IST