ఇటలీ నుంచి వచ్చిన కరోనా రోగులు ఆసుపత్రి నుంచి పరారీ

ABN , First Publish Date - 2022-01-07T12:59:35+05:30 IST

ఇటలీ దేశం నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో పంజాబ్ రాష్ట్రానికి వచ్చిన 13 మంది కరోనా పాజిటివ్ ప్రయాణికులు ఆసుపత్రి నుంచి పారిపోయారు....

ఇటలీ నుంచి వచ్చిన కరోనా రోగులు ఆసుపత్రి నుంచి పరారీ

అమృత్‌సర్ (పంజాబ్): ఇటలీ దేశం నుంచి చార్టర్డ్ ఫ్లైట్‌లో పంజాబ్ రాష్ట్రానికి వచ్చిన 13 మంది కరోనా పాజిటివ్ ప్రయాణికులు ఆసుపత్రి నుంచి పారిపోయారు. 19 మంది పిల్లలతో సహా 179 మంది ప్రయాణికులు ఇటలీ దేశంలోని మిలన్ నగరం నుంచి అమృత్‌సర్ నగరానికి చార్టర్డ్ ఫ్లైట్‌లో వచ్చారు. ఇటలీ నుంచి వచ్చిన వారికి పరీక్షలు చేయగా 125 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో కరోనా రోగులను ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్‌కు పంపారు.కొందరు కరోనా రోగులను అమృత్‌సర్‌లోని గురునానక్ దేవ్ ఆసుపత్రిలో చేర్చారు. కరోనా రోగుల్లో 13 మంది ఆసుపత్రి నుంచి పారిపోయారు. పారిపోయిన కరోనా రోగులు  తిరిగి రాకపోతే, తాము వారి ఫొటోలను వార్తాపత్రికలో ప్రచురిస్తామని అమృత్‌సర్ డిప్యూటీ కమిషనర్ గురుప్రీత్ సింగ్ ఖెహ్రా హెచ్చరించారు. 


డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ కింద పారిపోయిన కరోనా రోగులపై తాము కేసు నమోదు చేస్తామని గురునానక్ చెప్పారు.ఒమైక్రాన్‌కు అధిక ప్రమాదం ఉన్న దేశాల్లో ఇటలీ ఒకటి కాబట్టి ఆ దేశం నుంచి వచ్చిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్దేశించింది.అమృత్ సర్ జిల్లాలో కరోనా కట్టడి కోసం ప్రయత్నం చేస్తున్న ఇలా కరోనా రోగులు పారిపోవడాన్ని తాము సహించబోమని డిప్యూటీ కమిషనర్ చెప్పారు.కాగా ఇటలీ దేశంలో జరిపిన పరీక్షల్లో తమకు కరోనా నెగిటివ్ అని వచ్చిదని కానీ అమృత్ సర్ విమానాశ్రయంలో తమకు చేసిన పరీక్షల్లో కొవిడ్ పాజిటివ్ అని ఎలా వచ్చిందని విమాన ప్రయాణికులు ప్రశ్నించారు.


Updated Date - 2022-01-07T12:59:35+05:30 IST