ప్రైవేట్‌ పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలి

ABN , First Publish Date - 2020-07-26T09:56:34+05:30 IST

రోనా వైరస్‌ నేపథ్యంలో పాఠశాలలు మూతపడ డంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని, చాలా మంది పాఠశాలల నిర్వాహకు లు, ..

ప్రైవేట్‌  పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలి

మందమర్రిటౌన్‌, జూలై 25: కరోనా వైరస్‌ నేపథ్యంలో పాఠశాలలు మూతపడ డంతో తమ కుటుంబాలు వీధిన పడ్డాయని, చాలా మంది పాఠశాలల నిర్వాహకు లు, ఉపాధ్యాయులు అర్ధాకలితో అలమటిస్తున్నారని ప్రభుత్వం తమను ఆదుకో వాలని ట్రస్మా ఆధ్వర్యంలో శనివారం తహసీల్దార్‌ మోహన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ట్రస్మా మండలాధ్యక్షుడు శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి ఉప్పల య్యలు మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా వైరస్‌ విస్తరిస్తుండడంతో పాఠశాలలు తెరుచుకోక ఇబ్బందులు పడుతున్నామన్నారు.  పాఠశాలల నిర్వహకులు మాధవన్‌ తదితరులు పాల్గొన్నారు. 


బెల్లంపల్లి టౌన్‌: రాష్ట్రంలో కరోనా లాక్‌డౌన్‌ సందర్భంగా పాఠశాలలు, విద్యా సంస్థలు మూత పడ్డాయని, దీంతో రోడ్డున పడ్డ ఉపాధ్యాయులను, యజమాను లను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్‌కు ట్రస్మా ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ట్రస్మా గౌరవ  అధ్యక్షురాలు దోకూరి పూలమ్మ, అధ్యక్షుడు ఎ. రాజలింగు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యా యులకు నెలకు రూ. 15 వేల ఆర్థిక సహాయం అందించాలని, విద్యా సంస్థల యజమానులకు వడ్డీ లేని రుణాలు అందజేయాలని కోరారు.  వంగల చక్రపాణి, రాజేందర్‌, కుమార్‌, స్వర్ణలత, బి. షేశు కుమార్‌, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-26T09:56:34+05:30 IST