కొత్తగా 1,372 పాజిటివ్‌ కేసులు

ABN , First Publish Date - 2020-08-12T11:03:43+05:30 IST

జిల్లావ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు.

కొత్తగా 1,372 పాజిటివ్‌ కేసులు

కాకినాడ (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. వైరస్‌ వ్యాప్తి పెరుగుతుందే తప్ప తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ కొత్త కేసులు వేలల్లోనే నమోదవు తున్నాయి. రికవరీ శాతం పెరగడం లేదు. దీంతో యంత్రాం గం కత్తిమీద సాములా కొవిడ్‌ నియంత్రణపై అలుపెరగని పోరాటం చేస్తోంది. జిల్లాలో ప్రతీ రోజూ ఆరు వేల మంది అనుమానితులకు కొవిడ్‌ పరీక్షలు చేస్తున్నారు. ఇందులో అధికారిక లెక్కల మేరకు 1000 నుంచి 1300 కేసులు రోజూ వెలుగు చూస్తున్నాయి. యాంటీజన్‌ ర్యాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌, ట్రూనాట్‌ యంత్రాలతో పరీక్షలు చేస్తుండడంతో కొవిడ్‌ కేర్‌ కేంద్రాలు అనుమానితులతో కిక్కిరిసిపోతున్నాయి. హోం ఐ సోలేషన్‌లో చికిత్స పొందే వారి సంఖ్య క్రమంగా పెరుగు తోంది. ఈనెల 10 వరకూ జిల్లాలో 32,938 పాజిటివ్‌ కేసు లు నమోదయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో వచ్చిన ఫలితాలు 1,372 కేసులు బయటపడ్డాయి. దీంతో ఈ సంఖ్య  34,310 చేరుకుంది. తాజాగా పెద్దాపురం తహశీల్దార్‌ కొవిడ్‌ బారిన పడ్డారు.


ఇక ప్రాంతాల వారీగా చూస్తే అడ్డతీగల 3, అయినవిల్లి 8, అల్లవరం 20, అమలాపురం 46, అంబాజీ పేట 4, అనపర్తి 11, ఆత్రేయపురం 9, బిక్కవోలు 26, గండే పల్లి 1, గంగవరం 8, గోకవరం 2, గొల్లప్రోలు 4, ఐ పోల వరం 5, జగ్గంపేట 6, కడియం 1, కాజులూరు 1, కపిలే శ్వరపురం 15, కరప 31, కాట్రేనికోన 1, కోరుకొండ 8, కోటనందూరు 11, కొత్తపల్లి 4, కొత్తపేట 27, మల్కిపురం 4, మండపేట 8, ముమ్మిడివరం 10, ఇతర జిల్లాల వారు 1, పి గన్నవరం 7, పామర్రు 2, పెదపూడి 26, పెద్దాపురం 23, పిఠాపురం 33, సోలవరం 8, ప్రత్తిపాడు 12, రామచంద్ర పురం 37, రంపచోడవరం 5, రావులపాలెం 16, రాయవరం 39, రౌతులపూడి 1, సఖినేటిపల్లి 7, సామర్లకోట 22, శంఖ వరం 11, తాళ్లరేవు 27, తొండంగి 1, తుని 5, ఉప్పలగుప్తం 18, వై రామవరం 1, ఏలేశ్వరం 5 నమోదయ్యాయి.

Updated Date - 2020-08-12T11:03:43+05:30 IST