కంటిని కాపాడే క్యారెట్‌!

ABN , First Publish Date - 2020-06-11T05:30:00+05:30 IST

ఇంట్లో మమ్మీ క్యారెట్‌ జ్యూస్‌ చేస్తే ఇష్టంగా తాగుతారు కదా! మరి క్యారెట్‌ తీసుకోవడం వల్ల ఎలాంటి పోషకాలు లభిస్తాయో తెలుసా?...

కంటిని కాపాడే క్యారెట్‌!

ఇంట్లో మమ్మీ క్యారెట్‌ జ్యూస్‌ చేస్తే ఇష్టంగా తాగుతారు కదా! మరి క్యారెట్‌ తీసుకోవడం వల్ల ఎలాంటి పోషకాలు లభిస్తాయో తెలుసా? 


  1. క్యారెట్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్‌ పుష్కలంగా లభిస్తాయి.
  2. విటమిన్‌- ఎ అధికంగా లభిస్తుంది. అంతేకాకుండా ఇందులో ఉండే 
  3. ఫ్లావనాయిడ్‌ కాంపౌండ్స్‌ చర్మాన్ని, ఊపిరితిత్తులను రక్షిస్తాయి. కంటి చూపు బాగుండాలంటే క్యారెట్‌ ఎక్కువగా తీసుకోవాలి. 
  4. కాలేయ కణాల్లో కెరోటిన్స్‌ విటమిన్‌-ఎగా మారతాయి. క్యారెట్‌లో లభించే ముఖ్యమైన యాంటీ ఆక్సిడెంట్‌ బీటా కెరోటిన్‌.
  5. క్యారెట్‌లో ఉండే ఫాల్కరినల్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ కేన్సర్‌పై పోరాటానికి ఉపయోగపడుతుందని పరిశోధనల్లో వెల్లడయింది.
  6. ఇందులో విటమిన్‌-సి కూడా లభిస్తుంది. కణాల ఆరోగ్యానికి, దంతాలు, చిగుళ్ల సంరక్షణకు ఉపయోగపడుతుంది. 
  7. ఫోలిక్‌యాసిడ్‌, పిరిడాక్సిన్‌, థయామిన్‌ వంటి విటమిన్లు క్యారెట్‌లో లభిస్తాయి. జీవక్రియలు సక్రమంగా జరగడానికి ఇవి ఉపకరిస్తాయి.
  8. కాపర్‌, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ సైతం క్యారెట్‌ తీసుకోవడం వల్ల శరీరానికి అందుతాయి.

Updated Date - 2020-06-11T05:30:00+05:30 IST