క్యారట్‌తో గుండెకు మేలు!

ABN , First Publish Date - 2021-06-28T20:14:27+05:30 IST

క్యారట్‌ తింటే గుండెకు కూడా మంచిది. ఈ విషయం ఇల్లినాయిస్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడయింది. క్యారట్‌లో బీటా కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. డైట్‌లో

క్యారట్‌తో గుండెకు మేలు!

క్యారట్‌ తింటే గుండెకు కూడా మంచిది. ఈ విషయం ఇల్లినాయిస్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడయింది. క్యారట్‌లో బీటా కెరోటిన్‌ పుష్కలంగా ఉంటుంది. డైట్‌లో తీసుకున్న బీటా కెరోటిన్‌ శరీరంలోకి చేరుకున్నాక విటమిన్‌ -ఎ గా కన్వర్ట్‌ అవుతుంది. ఈ కన్వర్షన్‌ రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు. అంతేకాకుండా గుండె జబ్బులకు కారణమయ్యే అథెరోస్కెలెరోసిస్‌ డెవలప్‌ కాకుండా చూడడంలోనూ ఉపయోగపడుతున్నట్టుగా కనుగొన్నారు.


అథెరోస్కెలెరోసిస్‌ అనే గుండె జబ్బులో రక్తనాళాల్లో కొవ్వు పెరుకుపోతుంది. అయితే కొవ్వు పేరుకుపోకుండా చూడటంలో క్యారట్‌ ఉపయోగపడుతుంది. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు రెండు అధ్యయనాలు నిర్వహించారు. ఒకటి మనుషులపై, రెండో అధ్యయనం ఎలుకలపై జరిపారు. గుండె ఆరోగ్యంపై బీటాకెరోటిన్‌ ఏవిధమైన ఫలితం చూపుతుందో ఇందులో పరిశీలించారు. ఇందులో 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సున్న ఆరోగ్యవంతమైన 767 మంది బ్లడ్‌, డిఎన్‌ఏ నమూనాలను సేకరించారు. ఈ అధ్యయనంలో బీటాకెరోటిన్‌ కన్వర్షన్‌ చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిలను తగ్గిస్తున్నట్టు తేలింది. ఈ వివరాలను లిపిడ్‌ రీసెర్చ్‌ అనే జర్నల్‌లో ప్రచురించారు.

Updated Date - 2021-06-28T20:14:27+05:30 IST