క్యారెట్‌ రైస్‌... ఈజీ!

ABN , First Publish Date - 2020-04-08T05:49:19+05:30 IST

బోర్‌కొడితే భోజనానికి బదులు క్యారెట్‌ రైస్‌ను తినొచ్చు. దీన్ని వండడం ఈజీ. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది.

క్యారెట్‌ రైస్‌... ఈజీ!

బోర్‌కొడితే భోజనానికి బదులు క్యారెట్‌ రైస్‌ను తినొచ్చు. దీన్ని వండడం ఈజీ. ఇంటిల్లిపాదికి నచ్చుతుంది. 


కావలసిన పదార్థాలు

బియ్యం - కప్పు, ఆయిల్‌ - టేబుల్‌ స్పూన్‌, కరివేపాకు - పిడికెడు, కొత్తిమీర - పిడికెడు, యాలకులు - 4, ఉల్లిపాయ - పెద్దది 1, అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - టేబుల్‌ స్పూన్‌, క్యారెట్లు - పెద్దవి 2, కారం - రుచికి తగినంత

ఉప్పు - రుచికి తగినంత, వేయించిన పల్లీలు - పిడికెడు 


తయారుచేసే విధానం

ముందుగా అన్నం పొడిగా ఉండేలా వండుకోని చల్లారనివ్వాలి.  

కడాయిలో కొంచెం నూనె వేసి వేడయ్యాక యాలకులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగించాలి. దానికి అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ కలిపి వాసన పోయేదాకా వేగించాలి. క్యారెట్‌లను తురుముగా లేదా ముక్కలుగా కోసి కడాయిలో వేసి రెండు నిమిషాలు దోరగా వేగించిన తరువాత ఉప్పు చల్లి మూతపెట్టాలి. సన్నమంట మీద క్యారెట్‌ ఉడికిన తర్వాత దానికి తగినంత కారం, కొత్తిమీర చల్లుకోవాలి. తరువాత చల్లారిన అన్నాన్ని వేసి బాగా కలియబెట్టి కొంచెం ఉప్పు చల్లాలి. కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. ఆఖరున వేగించిన పల్లీలు కలుపుకోవాలి. అంతే క్యారెట్‌ రైస్‌ సిద్ధం. పెరుగు అప్పడాలు, రైతాతో ప్లేట్‌ లో వడ్డించుకోవచ్చు. చిన్నపిల్లలయితే ఇష్టంగా తింటారు.

Updated Date - 2020-04-08T05:49:19+05:30 IST