ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టండి

ABN , First Publish Date - 2020-04-05T11:03:02+05:30 IST

ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని గద్వాల మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌.కేశ్‌ అన్నారు

ఇంటింటి సర్వే పకడ్బందీగా చేపట్టండి

గద్వాల, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి)/గద్వాల టౌన్‌: ఇంటింటి సర్వేను పకడ్బందీగా చేపట్టాలని గద్వాల మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌.కేశ్‌ అన్నారు. కొత్త వారు ఎవ్వరైనా వచ్చారనే సమాచారంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయాలన్నారు. గద్వాలలోని 27 వార్డులో శుక్రవారం కరోనా పాజి టివ్‌ కేసు నమోదు కావడంతో అధికారులు, మునిసి పాలిటీ సిబ్బంది, అధికారులు, పాలకులు అప్రమ త్తయ్యారు. అలాగే  పట్టణంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల వద్ద అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తల కు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. 27 వార్డుతోపాటు 26, 29, 9, 10, 11, 12, 13, 25, 36 వార్డుల్లోని 4,800 కుటుంబాలను ఇంటింటి సర్వే నిర్వహించాలని అధికారులు ఆదేశించారు.


ఆర్డీ వో రాములు సిబ్బందికి ఎలాంటి సమాచారం సేక రించాలనే విషయంతో పాటు నమునా పత్రాలను అందించారు. ఇప్పటికే 17వ వార్డులో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడంతో నాలుగు వార్డుల్లో 2,390 కుటుంబాలకు రెండు రోజుల నుంచి ఇంటింటి సర్వేలు నిర్వహిస్తున్నారు. కరోనా పాజిటివ్‌ ఉన్న వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపించారు. గద్వాలలో ఇప్పటికే నాలుగు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వీటితోపాటు వడ్డెపల్లి జమ్మలమడుగు కాలనీలో ఇద్దరికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌తో గాంధీలో చికిత్స పొందుతున్నారు. కమిషనర్‌ నర్సింహ, వైద్య, ఆరోగ్యశాఖల అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-04-05T11:03:02+05:30 IST