Advertisement
Advertisement
Abn logo
Advertisement

అభివృద్ధి పనులు త్వరగా చేపట్టండి

వారంలోగా అగ్రిమెంట్‌ జరగాలి

మేయర్‌ సురే ష్‌బాబు 

కడప(ఎర్రముక్కపల్లె), నవంబరు 30: నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులు త్వరగా చేపట్టాలని మేయర్‌ సురే్‌షబాబు అధికారులను ఆదేశించారు. వారం రోజుల లోపు అగ్రిమెంట్‌ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. కడప కార్పొరేషన్‌ మేయర్‌ చాంబర్లో కమిషనర్‌ రంగస్వామి అధ్యక్షతన స్టాండింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. 44 అంశాలతో ఆమోదం పొందాయి. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులు ఆలస్యం చేయకుండా ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. టెండర్లు పిలిచి పనులు ప్రారంభించని కాంట్రాక్టర్‌ను బ్లాక్‌ లిస్టులో పెట్టి ఆ టెండర్‌ను రద్దు చేయాలని సూచించారు. అధికారులు ఎటువంటి అలసత్వం వహించొద్దని చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు షంషీర్‌, శివకోటిరెడ్డి, శ్రీలేఖ, వైసీపీ నాయకులు సూర్యనారాయణ, కార్పొరే షన్‌ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement