నిరుద్యోగ యువతకు సబ్సిడీపై కార్లు

ABN , First Publish Date - 2020-05-28T09:52:35+05:30 IST

నిరుద్యోగ యువతకు ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న కార్లను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ

నిరుద్యోగ యువతకు సబ్సిడీపై కార్లు

  • సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్‌

విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ యువతకు ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న కార్లను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పి.విశ్వరూప్‌ అన్నారు. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల గ్రౌండ్స్‌లో బుఉధవారం ఉదయం  ఎస్‌సీ కార్పొరేషన్‌ ద్వారా 12 మందికి ఇన్నోవా  ఇతియోస్‌ కారులు, 13 మంది పారిశుధ్య కార్మికులకు డ్రైనేజీ క్లీనింగ్‌ మిషన్లు కలిపి మొత్తం రూ.4,76,48,000 విలువగల యూనిట్లను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్‌సీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు ఈ యూనిట్లను సబ్సిడీపై అందిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ దళితుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, అదీప్‌రాజు, ఏపీఎస్‌సీడబ్ల్యుసీఎఫ్‌సీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2020-05-28T09:52:35+05:30 IST