కార్వీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్

ABN , First Publish Date - 2021-08-31T02:56:38+05:30 IST

కార్వీకి చెందిన ఆరు బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేసారు. కార్వీ ఎండీ పార్థసారథికి రెండు

కార్వీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్

హైదరాబాద్‌: కార్వీకి చెందిన ఆరు బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేసారు. కార్వీ ఎండీ పార్థసారథికి రెండు రోజుల కస్టడీ ముగిసింది. రెండ్రోజుల పాటు పార్థసారథిని సీసీఎస్ పోలీసులు విచారించారు. కార్వీ సంస్థకు చెందిన బ్యాంక్ ఖాతాల వివరాలను సీసీఎస్ పోలీసులు సేకరించారు. ఆరు బ్యాంకుల నుంచి వేల కోట్లలో కార్వీ  రుణాలు పొందింది. దీంతో కార్వీకి చెందిన ఆరు బ్యాంక్ అకౌంట్లను అధికారులు ఫ్రీజ్ చేసారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు ఎక్కడికి తరలించారని పోలీసులు ప్రశ్నించారు.


కార్వీ సంస్థ ఆడిట్ రిపోర్ట్ పోలీసులకు చేరింది. ఆడిట్ రిపోర్ట్ ముందుంచి పార్థసారథిని పోలీసులు ప్రశ్నించారు. పలు బ్యాంక్ లాకార్లపై  పోలీసులు కూపీ లాగారు. బ్యాంకుల వద్ద తీసుకున్న రుణాలపై పోలీసులు ఆరా తీసారు. పార్థసారథిని వైద్య పరీక్షలు నిమిత్తం ఉస్మానియాకి  తరలించి న్యాయమూర్తి ముందు  పోలీసులు హాజరు పరిచారు. అనంతరవ పార్థసారథిని చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. 

Updated Date - 2021-08-31T02:56:38+05:30 IST