యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ చేతికి కార్వీ ట్రేడింగ్‌ ఖాతాలు

ABN , First Publish Date - 2021-03-06T06:38:03+05:30 IST

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌కు చెందిన 11.5 లక్షల ట్రేడింగ్‌ ఖాతాలను యాక్సిస్‌ బ్యాంకుకు చెందిన యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ చేజిక్కించుకుంది. ఖాతాల బదిలీలో ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్‌ విధానాన్ని

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ చేతికి కార్వీ ట్రేడింగ్‌ ఖాతాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌కు చెందిన 11.5 లక్షల ట్రేడింగ్‌ ఖాతాలను యాక్సిస్‌ బ్యాంకుకు చెందిన యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ చేజిక్కించుకుంది. ఖాతాల బదిలీలో ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్‌ విధానాన్ని అనుసరిస్తోంది. ఖాతాల బదిలీని ఎక్స్ఛేంజీలు ప్రారంభించాయి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఖాతాదారులకు లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ వంటి అన్ని వివరాలను అందిస్తారు. షేర్లను యాక్సిస్‌ డీపీలోకి మార్చుకోవడానికి ఖాతాదారులు కొత్త డీమ్యాట్‌ ఖాతాను ప్రారంభించుకోవచ్చు. కొత్త ట్రేడింగ్‌ ఖాతాలతో యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ మొత్తం ఖాతాలు 36 లక్షలకు చేరతాయి.  

Updated Date - 2021-03-06T06:38:03+05:30 IST