శిశువు విక్రయం ఘటనలో నలుగురిపై కేసు

ABN , First Publish Date - 2020-10-25T07:40:33+05:30 IST

మండలంలోని కాళేశ్వరం గ్రామానికి చెందిన మహిళకు పుట్టిన మగ శిశువును విక్రయించడంపై ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనం స్థానికంగా చర్చ నీయాంశమైంది

శిశువు విక్రయం ఘటనలో నలుగురిపై కేసు

మహదేవపూర్‌, అక్టోబరు 24: మండలంలోని కాళేశ్వరం గ్రామానికి చెందిన మహిళకు పుట్టిన మగ శిశువును విక్రయించడంపై ‘ఆంధ్రజ్యోతి’లో శనివారం ప్రచురితమైన కథనం స్థానికంగా చర్చ నీయాంశమైంది. బాబు తల్లి పోలీసులను ఆశ్రయించింది. తమ బిడ్డను తమకు ఇప్పించమని శనివా రం ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేసి శిశువును స్వాధీనం చేసుకు న్నారు.  ఎస్సై నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. కాళేశ్వరం గ్రామానికి చెందిన సిరిపురం చంద్రక ళ స్థానికంగా ఉల్లిగడ్డలు అమ్ముతూ జీవిస్తోంది. ఆమెకు ఇదివరకే ముగ్గురు సంతానం. జూన్‌లో  మగ బిడ్డకు మహదేవపూర్‌ ఆస్పత్రిలో జన్మనిచ్చింది. ఆమె పేదరికాన్ని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలో పని చేస్తున్న నర్సు స్వరూప, స్వీపర్‌ పార్వతమ్మ జూన్‌ 28న చంద్రకళ వద్ద నుంచి శిశువును తీసు కెళ్లి రూ. 1.50 లక్షలకు మల్హర్‌ మండలంలోని వల్లెంకుట గ్రామానికి చెందిన సంపెడ శ్రీలత - సదు దంపతులకు విక్రయించారు.


తమ బాబు తిరిగిఇవ్వాలని ఆస్పత్రి సిబ్బందిని చంద్రకళ కోరింది. వారు ససేమిరా అనడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీనిపై స్పందించిన ఎస్సై నరహరి విచారణ చేపట్టారు. మధ్యవర్తులుగా ఉన్ననర్సు స్వరూప, మహదేవపూర్‌ ఆస్పత్రి స్వీపర్‌ పార్వతమ్మతో పా టు శిశువును కొన్న శ్రీలత, సదుపై కేసు నమోదు చేశారు. శ్రీలత నుంచి బాబును శిశు సంక్షేమ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated Date - 2020-10-25T07:40:33+05:30 IST