నిత్యావసరాల ధరలు పెంచారని 8 మందిపై కేసు

ABN , First Publish Date - 2021-05-17T16:25:24+05:30 IST

అధిక ధరలకు విక్రయించడం, పరిశుభ్రత పాటించకపోవడం..

నిత్యావసరాల ధరలు పెంచారని 8 మందిపై కేసు

హైదరాబాద్‌ సిటీ : లాక్‌డౌన్‌ సమయంలో నిత్యావసరాలను, మందులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు రావడంతో 4 జాయింట్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌లు రంగంలోకి దిగాయి. సివిల్‌ సప్లై, లీగల్‌ మెట్రాలజీ, డ్రగ్‌ కంట్రోల్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్షన్‌ బృందాలు పోలీసులతో కలిసి నగరంలోని పలు సూపర్‌ మార్కెట్లు, హోటళ్లు, మెడికల్‌ షాపులు, మెడికల్‌ డిస్ట్రిబ్యూటర్లు, కూరగాయల మార్కెట్లు, చికెన్‌ సెంటర్లు, స్వీట్‌ షాపులు, కిరాణా దుకాణాల్లో తనిఖీలో నిర్వహించాయి. అధిక ధరలకు విక్రయించడం, పరిశుభ్రత పాటించకపోవడం, నిబంధనలు పాటించని ఎనిమిది మంది వ్యాపారులపై కేసులు నమో దు చేశారు. వారి నుంచి రూ. 40 వేలు జరిమానా వసూలు చేశారు.

Updated Date - 2021-05-17T16:25:24+05:30 IST