Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆశలన్నీ భార్యపైనే పెట్టుకుని.. లక్షలు పోసి ఆమెను ఆస్ట్రేలియాకు పంపిస్తే చివరికి..

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌కు చెందిన ఓ యువతి తన భర్తకు భారీ షాకిచ్చింది. ఆస్ట్రేలియాకు వెళ్లాక వీసాకు స్పాన్సర్ చేస్తానని మాటిచ్చి చివరికి మొండిచేయి చూపించింది. కేవలం ఆస్ట్రేలియాకు వెళ్లేందుకే తనతో వివాహానికి ఒప్పుకుందని అర్థమైన భర్త చివరకు లబోదిబోమన్నాడు. బటాలా నగరానికి చెందిన ఇస్సాకు 2020 ఫిబ్రవరిలో ఆకాశ్‌దీప్‌తో వివాహం జరిగింది. అయితే..ఇస్సాకు విదేశాల్లో చదవాలని ఉండటంతో ఇందుకు అయ్యే ఖర్చంతా ఆకాశ్ కుటుంబం భరించాలని పెళ్లికి మునుపు ఇరు వర్గాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగానే ఇస్సా అక్కడకు వెళ్లాక..భర్త ఆకాశ్‌దీప్‌కు కూడా వీసా స్పాస్సర్ చేయాలి. ఈ క్రమంలో ఆకాశ్‌దీప్ కుటుంబం కోడలి విదేశీ చదువు కోసం రూ. 14 లక్షలు ఖర్చు చేసింది. 

అంతా అనుకున్నట్టే జరుగుతోందనుకుంటున్న తరుణంలో పరిస్థితులు ఊహించని మలుపు తిరిగాయి. తొలుత భర్తకు వీసా స్పాన్సర్ చేసేందుకు ముందుకు వచ్చిన ఇస్సా ఆ తరువాత.. భర్తతో గొడవ పడి..వీసా అప్లికేషన్ ఉపసంహరించుకునేలా చేసింది. అప్పటికీ వారి గొడవ సద్దుమణగకపోగా..మరింత ముదరడంతో చివరికి ఇస్సా తన స్పాన్సర్‌షిప్‌ను వెనక్కు తీసుకుంది. దీంతో.. తాము మోసపోయామని నిర్ధారించుకున్న ఆకాశ్‌దీప్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఆరోపణల ఆధారంగా పోలీసులు ఇస్సా, ఆమె తండ్రిపై సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement