మూడు జిల్లాల్లో కేసులు సున్నా

ABN , First Publish Date - 2021-01-26T08:56:51+05:30 IST

రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత కరోనా కేసులు వందలోపు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,717 శాంపిల్స్‌ను పరీక్షించగా 56 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది.

మూడు జిల్లాల్లో కేసులు సున్నా

అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుదీర్ఘ విరామం తర్వాత కరోనా కేసులు వందలోపు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 27,717 శాంపిల్స్‌ను పరీక్షించగా 56 మందికి పాజిటివ్‌గా తేలినట్టు వైద్యఆరోగ్యశాఖ సోమవారం వెల్లడించింది. కృష్ణాలో 11 కేసులు మినహా మిగిలిన జిల్లాల్లో పదిలోపే కేసులు నమోదయ్యాయి. అనంతపురం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదుకాలేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,066 మందికి వైరస్‌ సోకింది. కాగా, తొలిదశ కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ మరో 9,090 మందికి కరోనా టీకా అందించింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 850 కేంద్రాల్లో 8,299 మందికి కొవిషీల్డ్‌, 40 కేంద్రాల్లో 791 మందికి కొవాగ్జిన్‌ టీకా వేశారు. 

Updated Date - 2021-01-26T08:56:51+05:30 IST