Abn logo
Jul 7 2020 @ 04:46AM

లాక్‌డౌన్‌ ఉల్లంఘనలపై కేసులు

కర్నూలు, జూలై 6: జిల్లాలో సోమవారం లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. 188, 269, 270, 271 సెక్షన్ల కింద నిబంధనలు ఉల్లంఘించి దుకాణాలు తెరిచిన వారు. ఇతర వ్యక్తులు 35 మందిపై 13 కేసులు నమోదు చేశారు. వీటితో పాటు రోడ్డు భద్రత నిబంధనలు పాటించని వాహనదారులుపై 1582 ఎంవీ కేసులు నమోదు చేసి రూ.3,37,745 జరిమానా విధించారు. 9 వాహనాలు సీజ్‌ చేశారు. అలాగే మాస్కులు లేకుండా తిరుగుతున్న వారిపై 992 కేసులు నమోదు చేసి రూ.82,700 జరిమానా విధించారు. 

Advertisement
Advertisement
Advertisement