భూరికార్డులు మాయం చేసిన వారిపై కేసులు

ABN , First Publish Date - 2021-06-15T07:16:29+05:30 IST

వలేటి వారిపాలెం, లింగసముద్రం మండలాల్లో ఐదేళ్ల క్రితం కొంతమంది వ్యక్తులు స్వలాభం కోసం రెవెన్యూ రికార్డులు మాయం చేశారని, వారిపై త్వరలో కేసులు నమోదు చేస్తామని శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు.

భూరికార్డులు మాయం చేసిన వారిపై కేసులు
పాసుపుస్తకాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి

వలేటివారిపాలెం, జూన్‌ 14 : వలేటి వారిపాలెం, లింగసముద్రం మండలాల్లో ఐదేళ్ల క్రితం కొంతమంది వ్యక్తులు స్వలాభం కోసం రెవెన్యూ రికార్డులు మాయం చేశారని,  వారిపై త్వరలో కేసులు నమోదు చేస్తామని శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. స్థానిక తహసీల్దారు కార్యాలయ ఆవరణలో సోమవారం తహసీల్దారు రెహ్మన్‌ అధ్యక్షతన రైతులకు ఈ పాస్‌ పుస్తకాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ వలేటి వారిపాలెం, లింగసముద్రం మండలాల్లో మొత్తం 250 సర్వే నంబర్లు మాయమైనట్లు తెలిపారు. వలేటివారిపాలెం మండలంలోని చుండి రెవెన్యూ గ్రామంలోనే 100 సర్వే నంబర్లు మాయమయ్యాయన్నారు. ఆ మండలాల్లోని రెవెన్యూ రికార్డులు మాయం పై ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఆర్‌ఎస్‌ఆర్‌, ఎప్‌ఎల్‌ఆర్‌ తదితర రెవె న్యూ రికార్డుల మాయంపై కందుకూరు సబ్‌కలెక్టర్‌ క్షుణ్ణంగా పరిశీలించనున్న ట్లు తెలిపారు. రెవెన్యూ రికార్డులు మాయం చేసి సెంటు భూమి లేకుండా ఆన్‌లైన్‌లో 25 నుంచి 30 ఎకరాలు ప్రభుత్వ భూము లు ఎక్కించుకొని బ్యాంకులలో రుణాలు పొందిన వారిపై రెండుమూడురోజులలో కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటా మన్నారు. అనంతరం 24 మంది రైతులకు ఈ-పాస్‌ పుస్తకాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రపీద్‌ అహ్మద్‌, ఆర్‌ఐ ప్రసాద్‌, వైసీపీ నాయకులు పరిటాల వీరాస్వామి, అను మోల లక్ష్మీనరసింహం, కట్టా హనుమంతరావు, ఇంటూరి హరిబాబు, ఇరపని సతీష్‌, డేగా వెంకటేశ్వర్లు, కుంబాల క్రాంతికుమార్‌, యాళ్ల శివకుమార్‌రెడ్డి, అనుమోల వెంకటేశ్వర్లు, వడ్లమూడి రమేష్‌బాబు, మన్నం వెంకటరమేష్‌, వడ్లమూడి నరసయ్య, ఉన్నం వెంకటేశ్వర్లు దివి వీరయ్య, కంచర్ల బాలాజీ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-15T07:16:29+05:30 IST