Abn logo
Nov 28 2020 @ 03:10AM

విద్యార్థులపై కేసులు ఎత్తేయాలి: ఓయూ జేఏసీ

ఉప్పల్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి) : అక్రమ కేసులను ఎత్తేయడంతో పాటు ఉస్మానియా యూనివర్సిటీ గేట్లను తెరవని పక్షంలో మరో ఉద్యమం తప్పదని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు హెచ్చరించారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తొలి దశ ఉద్యమకారులు, విద్యార్థి నాయకులను కలిసేందుకు ఈనెల 24న వచ్చిన బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్యతో పాటు విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు.

ఎంపీ తేజస్వి సూర్య ఉస్మానియా వర్సిటీలో ఈ నెల 24న  రాజకీయ సమావేశాన్ని నిర్వహించి  నియమావళిని ఉల్లంఘించారని రాష్ట్ర ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు.  


Advertisement
Advertisement
Advertisement