‘ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి’

ABN , First Publish Date - 2021-09-18T05:30:00+05:30 IST

తమకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ మోతుగూడెం పరిధిలోని ఇంతులూరు వాగు ఒడియా క్యాంపు వాసులు, పోర్చా కులస్తులు శనివారం ఆందోళన చేపట్టారు.

‘ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలి’

మోతుగూడెం, సెప్టెంబరు 18: తమకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని కోరుతూ మోతుగూడెం పరిధిలోని ఇంతులూరు వాగు ఒడియా క్యాంపు వాసులు, పోర్చా కులస్తులు శనివారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40ఏళ్లుగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నామని, నేటికీ గ్రామస్థులకు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ఓటర్‌ ఐడీకార్డు, ఉపాధిహామీ కార్డు ఇస్తున్నా ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు మాత్రం ఇవ్వ డం లేదని ఆందోళన వ్యక్తంచేశారు. కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయకపోవడం వల్ల చదువుకున్న పిల్లలకు ఉద్యోగావకాశాలు రాకుండా పోతున్నాయని విచారం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వంతల ప్రసాద్‌ మాట్లాడుతూ సీలేరు గ్రామస్థులైన తమ కులస్తులకు ఎస్టీ సర్టిఫికెట్స్‌ కావాలని 40ఏళ్ల నుంచి పోరాడుతున్నా ఇవ్వడంలేదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమను గుర్తించి ఎస్టీ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని కోరారు.

Updated Date - 2021-09-18T05:30:00+05:30 IST