అడిగిన డబ్బు ఇవ్వలేదని కుల బహిష్కరణ

ABN , First Publish Date - 2020-09-23T21:50:33+05:30 IST

ఉద్యోగం రావడానికి సహకరించిన దాయాదులకు అడిగిన డబ్బు ఇవ్వలేదని ఓ గ్రామ సేవకుడిని బహిష్కరించారు.

అడిగిన డబ్బు ఇవ్వలేదని కుల బహిష్కరణ

యశ్వంతపూర్: ఉద్యోగం రావడానికి సహకరించిన దాయాదులకు అడిగిన డబ్బు ఇవ్వలేదని ఓ గ్రామ సేవకుడిని బహిష్కరించారు. కులస్తులు ఎవరైనా.. వారి ఇంటికి వెళ్లినా.. కార్యక్రమాల్లో పాల్గొన్నా.. ఎల్లమ్మగుడివద్ద గుండు గీయించి, ఐదు చెప్పు దెబ్బల శిక్ష విధిస్తామని హుకూం జారీ చేశారు. ఈ సంఘటన జనగామ మండలంలోని యశ్వంతపూర్‌లో జరిగింది.


యశ్వంతపూర్‌ గ్రామానికి చెందిన గ్రామ సేవకుడు గడ్డం సిద్ధయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. వారసత్వంగా సిద్ధయ్య కొడుకు రవికుమార్‌కు గ్రామ సేవకుడు ఉద్యోగం లభించింది. అయితే ఈ విషయంలో సహకరించిన దాయాదులు రూ. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం ఎల్లమ్మ గుడి వద్ద పంచాయతీ చేశారు. గడ్డం కులస్తులకు రూ. 15 లక్షల ఇవ్వాలని, లేదంటే గ్రామ సేవకుడు ఉద్యోగం వదులుకోవాలని బెదిరించారు.


అయితే కుటుంబ పరిస్థితులు బాగాలేవని రూ. 5 లక్షలు ఇస్తానని రవికుమార్ బతిమాలినా దాయాదులు వినలేదు. ఉద్యోగం వద్దని సంతకం చేయాలని నిలదీశారు. లేదంటే కుల బహిష్కరణకు అగ్రిమెంట్ రాశారు. చివరికి రూ. 8 లక్షలు ఇచ్చి గడ్డం కుల పెద్దల కాళ్లు మొక్కాలని బేరానికి దిగారు. అయినా రవి కుమార్ వినకపోవడంతో కుల బహిష్కరణ చేశారు.

Updated Date - 2020-09-23T21:50:33+05:30 IST