Abn logo
Oct 6 2021 @ 15:52PM

కేంద్రం కుల గణన చేయకపోవడం ఏంటి?: ఎల్‌. రమణ

హైదరాబాద్: కేంద్రం కుల గణన చేయకపోవడం ఏంటి? అని టీఆర్‌ఎస్‌ నేత ఎల్‌. రమణ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుల గణనపై సీఎం కేసీఆర్‌ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. పార్లమెంట్ నడుస్తున్నందున వెళ్లి కుల గణనపై మాట్లాడుదామన్నారు. కొద్దిమంది చేతుల్లోనే వేల కోట్లు ఉంటున్నాయని, కానీ దేశంలో పూటగడవని వారు ఎంతోమంది ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ గణనపై పోరాడుదామని ఎల్‌. రమణ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండిImage Caption